Ramgopal Varma Upcomming Movie 26/11 !!!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలన సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. 2008 నవంబర్ 26న ముంబై మహా నగరంపై జరిగిన ముష్కర దాడిని సినిమా రూపంలోకి తేవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమా పేరు '26/11' నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ...''26/11 సంఘటన ఏ భారతీయుడు మరిచపోని రోజు...అప్పుడు ఉగ్రవాదులు జరిపిన దాడిని లైవ్ టెలికాస్ట్ చూసిన వారి కళ్లలో ఆ సంఘటన ఇప్పటికీ మెదలుతూనే ఉంది. అప్పుడు జరిగిన నరమేధం ఎన్నటికీ మరిచిపోనిది. నా కెరియర్ లోనే ఒక చాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతున్నాను'' అని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ముష్కర దాడులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్, అతని కొడుకు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి దాడికి గురైన తాజ్ హోటల్ హోటల్ ను వర్మ సందర్శించారు. అప్పట్లోనే వర్మ ఈ ఈ ఘటనపై సినిమా తీస్తున్నట్లు, అందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటింపచేయాలనే ఉద్దేశ్యంతోనే అతన్ని వెంట తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లాడని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పటుడు ఆ వర్తాలను ఖండించిన వర్మ...తాజాగా ఆ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకోవడం గమనార్హం. |
No comments:
Post a Comment