Venki bodyguard Powerful Dialoges
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న బాడీగార్డు సినిమా ఆడియో వెంకీ బర్త్ డేను పురస్కరించుకుని శిల్పాకళా వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన భారీ డైలాగులు బయటకు లీకయ్యాయి. ఇందులో వెంకటాద్రి, బాడీగార్డ్ పాత్రను పోషిస్తున్న వెంకీ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ''వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పడుతుంది, పట్టుకుంటే రక్తం పడుతుంది'' లాంటి డైలాగులు సినిమాలో బోలెడు ఉన్నాయి. ఇటీవల తెలుగు సినిమాల్లో పవర్ డైలాగులు, పంచ్ డైలాగులు బాగా పేలుతున్న నేపథ్యంలో...ఈ సినిమాలో ఈ తరహా ఎంటర్ టైన్మెంట్ పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్నారు. వెంకీ సరసన త్రిష నటిస్తోంది. ఇందులో త్రిష పెద్దింటి అమ్మాయిగా, కాలేజీ గర్ల్ గా నటిస్తుండగా, ఆమెకు బాడీగార్డుగా వెంకీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా బాడీగార్డ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. |
No comments:
Post a Comment